పిఠాపురంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానం కోసం కొత్త దేవా జగన్మోహన్ రావు, అన్నపూర్ణాదేవి దంపతులు రూ. 1 లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవస్థానం ఈఓ జగన్మోహన్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ భద్రరావు, పురోహితులు దాతలను సత్కరించి, స్వామివారి చిత్రపటం అందించి ఆశీర్వదించారు.