గురువారం కోటనందూరులో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 25 మంది మైనర్లను గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు. వాహనాలు నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.