రిటైర్డ్ పోలీసులకు ఎస్పీ బిందు మాధవ్ సన్మానం

752చూసినవారు
రిటైర్డ్ పోలీసులకు ఎస్పీ బిందు మాధవ్ సన్మానం
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం, పదవీ విరమణ చేసిన ఐదుగురు పోలీసు అధికారులను ఎస్పీ బిందు మాధవ్ ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖలో సేవ చేయడం సమాజ భద్రతకు అంకితమవడమేనని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు అందించిన సేవలను ప్రశంసిస్తూ జ్ఞాపికలు అందజేశారు. విశ్రాంత జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ సత్యనారాయణతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్