తునిలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

7చూసినవారు
తునిలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
తుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పర్యవేక్షణలో 13వ వార్డు జీఎన్టీ రోడ్ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టారు. రహదారులపై పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్ర వాతావరణం కల్పించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని సిబ్బందికి, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సహకరించాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్