చంద్ర గ్రహణం సందర్భంగా తలుపులమ్మ లోవ ఆలయం మూసివేత

1చూసినవారు
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకే తునిలోని శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానం మూసివేయబడింది. గ్రహణ ప్రభావంతో తునిలోని ఇతర ఆలయాలు కూడా మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు. భక్తులు ఈ సమయాలను గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్