కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామానికి చెందిన వడ్లమూరి దేవి ఏపీ పీజీ సెట్-2026లో తెలుగు విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్న దేవి తన గురువుల ప్రోత్సాహం, తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ డాక్టర్ పుష్పలత మార్గదర్శకత్వానికి ఈ విజయాన్ని అంకితం చేసింది. ఆమె సాధించిన ఘనతపై కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.