గోవా రాష్ట్ర గవర్నర్ గా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు సోమవారం నియమితులయ్యారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా పనిచేసిన ఆయన మొదటి నుంచి టీడీపీ వెంట నడిచిన వారిలో ఒకరుగా ఉన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. గవర్నర్ గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందని అన్నారు.