తుని మండలం చేపూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీల కూలి బకాయిలు చెల్లించాలంటూ సీఐటీయు నాయకులు శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకుడు నక్కెళ్ళ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. సుమారు 10 నుంచి 13 వారాల వరకు కూలీ బకాయిలు ఉన్నాయని, దీనివల్ల కూలీల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే బకాయిలు చెల్లించని పక్షంలో ఎండీఓ కార్యాలయం ముట్టడిస్తామంటూ హెచ్చరించారు.