సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టారని లేనిపోని కారణాలు చూపి వైకాపా కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు విమర్శించారు. తుని పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును ఉద్దేశించి మాట్లాడారు. ఇళ్లల్లో కూలీ పనులు చేసుకునే వారిపై కాకుండా, ధైర్యముంటే ప్రత్యర్థిగా ఉన్న తనపై కేసులు పెట్టి జైలుకు పంపాలన్నారు.