కాకినాడ జిల్లాలోని తునిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైసీపీ పాలనలో విధ్వంసమే రాజ్యమేలిందని, వారి విధానం గొడ్డలి పార్టీతో సమానమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడు చేసేవారిని దూరం పెట్టకపోతే సమస్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని సీఎం తెలిపారు.