Feb 08, 2026, 08:02 IST/
బరువు తగ్గే ప్రయత్నంలో నటి సుప్రితకు అనారోగ్యం
Feb 08, 2026, 08:02 IST
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత, హీరోయిన్‌గా 'అమరావతికి ఆహ్వానం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల బరువు తగ్గాలనే ప్రయత్నంలో అతిగా ఉపవాసం ఉండటంతో అనారోగ్యానికి గురై, 15 రోజుల పాటు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ సమయంలో తీవ్రమైన వాంతులు, నీళ్లు తాగినా ఇబ్బంది పడ్డానని, బతకనేమో అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, మంచి స్క్రిప్ట్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తానని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు సిస్టర్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.