Apr 21, 2026, 07:04 IST/
ORRపై రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి (వీడియో)
Apr 21, 2026, 07:04 IST
TG: హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి ప్రశాంత్ గౌడ్ (41), ఆయన 11 ఏళ్ల కుమారుడు శ్రీతన్ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యగిరి ఎల్లమ్మ దర్శనానికి వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ భార్య వాణి, కుమార్తె శశిక తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వనస్థలిపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.