Oct 24, 2025, 02:10 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: హంస వాహనంపై విహరించిన కురుమూర్తి రాయుడు
Oct 24, 2025, 02:10 IST
దేవరకద్ర నియోజకవర్గంలోని శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా కురుమూర్తి స్వామి వారు హంస వాహనంపై విహరించారు. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని కురుమూర్తి కొండలోని కాంచన గుహ నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా కాంచనగిరి గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈఓ, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.