Mar 15, 2026, 07:03 IST/గద్వాల్
గద్వాల్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
Mar 15, 2026, 07:03 IST
శనివారం తెల్లవారుజామున వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు తిక్కయ్య, మరికొందరు రైతులు తమ పొగాకును మార్కెట్ కు తరలించేందుకు శేఖర్ నడుపుతున్న ట్రాక్టర్లో బయలుదేరారు. ధర్మవరం స్టేజి సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి డీసీఎం ఢీ కొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు తిక్కయ్య తీవ్రంగా గాయపడగా, ట్రాక్టర్ డ్రైవర్ శేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జాతీయ రహదారి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.