Apr 24, 2026, 18:04 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: మహిళ బలవన్మరణం కేసులో నిందితుడి అరెస్టు: ఎస్ఐ
Apr 24, 2026, 18:04 IST
నారాయణపేట పట్టణంలో ఈ నెల 21న సింధు అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతికి కారణమైన మాగనూరు మండలం గురులింగంపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినోద్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వేధింపుల కారణంగానే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వినోద్ ను రిమాండుకు తరలించి, అనంతరం జైలుకు తరలించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.