Dec 08, 2025, 02:12 IST/
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్.. 3 విమానాలకు బాంబు బెదిరింపు
Dec 08, 2025, 02:12 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. కన్నూర్-హైదరాబాద్ ఇండిగో, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా, లండన్-హైదరాబాద్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. అధికారులు అప్రమత్తమై, విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయించి, ప్రయాణీకులను తరలించారు. బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో బాంబులు లేవని తేలింది. ఈ మెయిల్స్ ఫేక్ అని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.