Mar 11, 2026, 18:03 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
అచ్చంపేట: 8. 75 క్వింటాల నల్ల బెల్లం స్వాధీనం!
Mar 11, 2026, 18:03 IST
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్లపాడు తండాలో అక్రమంగా నాటు సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం నిల్వలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం, సబావత్ నిరంజన్ అనే వ్యక్తి ఇంట్లో 30 బస్తాలలో దాదాపు 8.75 క్వింటాళ్ల నల్ల బెల్లం ఉన్నట్లు గుర్తించారు. గ్రామస్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి, నిరంజన్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్రమంగా నాటు సారా తయారు చేసి, నల్ల బెల్లం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.