
మదురుపూడి గ్రామంలో కనక దుర్గమ్మ జాతరలో పాల్గొన్న శ్రీనివాసరావు
కోరుకొండ మండలం మదురుపూడి గ్రామంలో ఆదివారం శ్రీ కనక దుర్గమ్మవారి 36వ జాతర మహోత్సవాల్లో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, కమిటీ సభ్యులకు 10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మన సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో పేదల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు.






































