Mar 23, 2026, 18:03 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: పోలీసుల తక్షణ చర్యతో రూ. 62, 000 నగదు రికవరీ
Mar 23, 2026, 18:03 IST
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ స్టేజి దగ్గర ఆటోలో మర్చిపోయిన రూ. 62,000 నగదు బ్యాగ్‌ను పోలీసులు చాకచక్యంగా రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. గద్వాల్‌కు చెందిన ఉమాదేవి తన తల్లిగారి ఊరు పొన్నకల్ నుండి ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్సు ఎక్కే తొందరలో కుటుంబ సభ్యుల క్యాన్సర్ చికిత్స కోసం తీసుకెళ్తున్న నగదు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయినట్లు అడ్డాకుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పీసీ ఏ. రాహుల్ సీసీ కెమెరాలను పరిశీలించి ఆటోను గుర్తించారు. ఖిలాఘణపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ చంద్రకాంత్ నిజాయితీగా ఆ నగదు బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు.