Jan 13, 2026, 16:01 IST/
సంక్రాంతి తర్వాతే మున్సిపల్ రిజర్వేషన్లు!
Jan 13, 2026, 16:01 IST
సంక్రాంతి పండుగ తర్వాతే మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. రిజర్వేషన్ల ప్రకటన కోసం ఆశావాహులు, నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అధికారులు రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడైనా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆపై ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.