
కరప: పేకాట శిబిరంపై దాడిలో పది మంది అరెస్ట్
కరప మండలంలోని గురజనాపల్లిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఎస్ఐ తోట సునీతకు సమాచారం అందింది. ఆమె మెరుపు దాడిలో పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 14,574 నగదు, 104 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.




































