
కాకినాడ: పోలీస్ కార్యాలయంలో అబుల్ కలాం జయంతి వేడుకలు
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై, అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రానంతరం ఆయన దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని ఎస్పీ తెలిపారు.



































