Oct 27, 2025, 17:10 IST/గద్వాల్
గద్వాల్
గద్వాల: ఉద్యానవన శాఖ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి
Oct 27, 2025, 17:10 IST
PMDDKY జోగులాంబ గద్వాల జిల్లా నోడల్ ఆఫీసర్ పౌసుమి బసు, ఉద్యానవన శాఖ అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం బీచుపల్లి ఆయిల్ మిల్ ప్రాంగణంలో ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించి, సాగు వివరాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు. కొండేరులో రైతుల కూరగాయల పంటను పరిశీలించి, గ్రూపులుగా వ్యవసాయం చేసి లబ్ధి పొందాలని సూచించారు.