May 21, 2026, 15:05 IST/
‘రెడ్ జోన్’లోకి చమురు మార్కెట్లు.. IEA చీఫ్ హెచ్చరిక
May 21, 2026, 15:05 IST
చమురు మార్కెట్లు జులై లేదా ఆగస్టులో 'రెడ్ జోన్'లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభానికి హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే పరిష్కారమని ఆయన సూచించారు. పశ్చిమాసియా నుంచి సరఫరాలు నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు మరింత క్షీణిస్తాయని, ప్రస్తుతం ఉన్న మిగులు నిల్వలు కూడా తగ్గిపోతున్నాయని బిరోల్ లండన్లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు.