May 14, 2026, 06:05 IST/గద్వాల్
గద్వాల్
గద్వాల: అలా చేస్తే కఠిన చర్యలు
May 14, 2026, 06:05 IST
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని భీంనగర్లో ఫుట్పాత్ ఆక్రమణలను మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి, కమిషనర్ జానకీ రాంసాగర్ పరిశీలించారు. రహదారుల వెంట మార్కింగ్ చేసిన మేరకు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.