Apr 18, 2026, 17:04 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం
Apr 18, 2026, 17:04 IST
పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు నిరసనగా, వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సతీష్ నేతృత్వంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణను దేశ విభజన రక్తపాతంతో పోల్చడం కోట్లాది మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని నాయకులు మండిపడ్డారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.