Mar 10, 2026, 13:03 IST/
కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ
Mar 10, 2026, 13:03 IST
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న వడ్డీ రేటునే ఈసారి కూడా కొనసాగించాలని సీబీటీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలపగానే, వడ్డీ మొత్తం చందాదారుల ఖాతాల్లో జమ కానుంది. కాగా, వడ్డీని ప్రతి నెలా లెక్కించి, ఆర్థిక సంవత్సరం చివరలో ఏకమొత్తంగా ఖాతాలో జమ చేస్తారు.