Apr 16, 2026, 13:04 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్: సీఎం మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
Apr 16, 2026, 13:04 IST
తెలంగాణ సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) సంపూర్ణ డేటా, నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహ, మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.