
ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రాజప్ప
అచ్చంపేటలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించారు. అందిన అన్ని దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి తగిన పరిష్కారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కూటమి నేతలు పాల్గొన్నారు.






































