
పిఠాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పిఠాపురం పట్టణంలో మంగళవారం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వివిధ వార్డుల్లో పర్యటించి, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న అర్హులైన బాధితులకు ఈ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వార్డు ఇంచార్జులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.








































