
జిల్లా కలెక్టరేట్ PGRSకు 255 అర్జీలు
ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను కేవలం నమోదు చేయడమే కాకుండా, వాటిని సకాలంలో పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ వై. మేఘా స్వరూప్, తదితర అధికారులతో కలిసి కలెక్టర్ 255 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.






































