
మురమండలో ఘనంగా శ్రీ ఆంజనేయ విగ్రహ శంకుస్థాపన
కడియం మండలం మురమండ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రాజాన మాలునాయుడు, దేవి దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు నాగదేవర విశ్వనాథ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో 15 అడుగుల ఎత్తు గల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.







































