
మహనీయుల త్యాగాలు, సేవలను భావితరాలకు చేరవేయాలి
రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను నిర్వహిస్తోందని, వారి త్యాగాలు, సేవలను భావితరాలకు చేరవేయడమే ఈ సంకల్పమని ఇంచార్జి DRO ఎస్. భాస్కర్ రెడ్డి తెలిపారు. శనివారం రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాసేవ వంటి విలువలను సమాజంలో నెలకొల్పిన మహనీయుల జీవితాలు యువతకు దిశానిర్దేశం చేస్తాయని ఆయన అన్నారు.




































