
రాజానగరం: తోటలో పులి పాదముద్రలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారికి సమీపంలో రఘునాథపురంలోని ఓ తోటలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామంలో గేదె కళేబరం లభించడంతో, దాని లేగదూడను పులి తీసుకెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. పులిని బంధించడానికి ట్రాప్ కెమెరా, బోను సిద్ధం చేశారు. పుణె నుంచి నిపుణుల బృందం బయల్దేరింది. ఎన్టీసీఏ రాజశేఖర్ బృందం, అటవీశాఖ అధికారులు మంగళవారం నుంచి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎఫ్. బీఎన్ఎన్ మూర్తి, డీఎఫ్ వో ప్రభాకర్ రావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గావీదు రాజు, స్క్వాడ్ డీఎఫ్ శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పల్లా శ్రీనివాస్ తో పాటు 30 మంది సిబ్బంది పులిని బంధించడానికి చర్యలు చేపట్టారు.





































