
అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం
సీతానగరం మండలం చిన్న కొండేపూడి దళితవాడలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప్పాడ చింతయ్యకు చెందిన తాటాకు ఇల్లు దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.































