Jan 21, 2026, 18:01 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ లో వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
Jan 21, 2026, 18:01 IST
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం మంత్రి జూపల్లి కృష్ణారావుకు బుధవారం వినతిపత్రం అందజేసింది. మహబూబ్ నగర్ వెళ్లడం వల్ల అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జిల్లాలోనే కేంద్రం ఉంటే సౌకర్యంగా ఉంటుందని సంఘం నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో విద్యార్థులకు, అధ్యాపకులకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు ఆశిస్తున్నారు.