Mar 08, 2026, 12:03 IST/
నైజీరియాలో ఘోర ప్రమాదం. 22 మంది విద్యార్థులు మృతి
Mar 08, 2026, 12:03 IST
నైజీరియాలోని జోస్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో 22 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 130 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.