
బ్యాంక్ పక్కన మద్యం షాపు తొలగించాలి
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లోని స్టేట్ బ్యాంక్ పక్కన మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల బ్యాంకు ఖాతాదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రధాన రహదారి కావడంతో విద్యార్థులు, వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి షాపును అక్కడి నుంచి తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

































