Apr 18, 2026, 11:04 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్: ప్రమాదరహిత రాష్ట్రమే లక్ష్యం: మంత్రి పొన్నం
Apr 18, 2026, 11:04 IST
తెలంగాణను రోడ్డు ప్రమాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన 'అరైవ్, అలైవ్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.