
తుని మండలంలో అగ్ని ప్రమాదం
తుని మండలం తాళ్లూరులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక తాటాకింట్లో మంటలు చెలరేగడంతో ఇంట్లోని గృహోపకరణాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్రామస్థులు వారిని పరామర్శించి, సహాయం అందించారు.







































