Mar 07, 2026, 18:03 IST/గద్వాల్
గద్వాల్
గద్వాల జిల్లాలో నేటి నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ
Mar 07, 2026, 18:03 IST
జోగులంబ గద్వాల జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు ఈ నెల 8వ తేదీ (ఆదివారం) నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సంధ్య కిరణ్మయి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7,103 మంది 14 ఏళ్ల బాలికలు ఉన్నట్లు గుర్తించారు.