వెండి పట్టీలు గాలిలోని తేమ, రసాయనాల వల్ల మసకబారుతాయి. దీనిని నివారించడానికి, బేకింగ్ సోడా, నీటితో పేస్ట్ చేసి రుద్దడం, వెనిగర్‌లో నానబెట్టడం, టూత్‌పేస్ట్‌తో శుభ్రపరచడం వంటి ఇంటి చిట్కాలతో తెల్లగా మెరిసేలా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆభరణాలను ఎయిర్‌టైట్ డబ్బాల్లో, గాలి, తేమ తక్కువగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయాలంటున్నారు. పరిమళ ద్రవ్యాలు, స్నానం, ఈత సమయంలో తీసివేయాలని వివరించారు. తరచుగా ధరించడం వల్ల కూడా మెరుపు పెరుగుతుందన్నారు.