ప్రస్తుత ప్రపంచంలో లోన్, క్రెడిట్‌కార్డ్ పొందాలంటే క్రెడిట్ స్కోర్ కీలకం. స్కోర్‌ను సులభంగా పెంచుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలి. క్రెడిట్ కార్డు బిల్లును గడువు తేదీకి ముందు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) 30% లోపు ఉండేలా చూసుకోవాలి. తరచుగా కొత్త కార్డులకు అప్లై చేయకూడదు. పాత కార్డులను క్లోజ్ చేయకూడదు. 750కి పైగా స్కోర్ ఉంటే మంచిది. ఈ అలవాట్లు క్రెడిట్ కార్డును ఆర్థిక బలంగా మారుస్తాయి.