అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన 'బీఫ్' వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గోమాంసం వినియోగాన్ని పూర్తిగా నిషేధించబోమని, అయితే దానిని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇళ్లకే పరిమితం చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని ఆయన వెల్లడించారు. అయితే, ముస్లిం మెజారిటీ ఓట్ల కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసోం పశువుల సంరక్షణ చట్టం-2021 ప్రకారం, దేవాలయాలు, మఠాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, హిందువులు, సిక్కులు, జైనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో గోమాంసం అమ్మకం, వినియోగంపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి.