వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఆకుకూరలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటిపై సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతాయి. కాకరకాయ, కీరదోస, పుట్టగొడుగులు, దొండకాయ, ముల్లంగి, సొరకాయ, బీరకాయ, కందగడ్డ వంటి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.