ఆహారాన్ని వేగంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి, అధికంగా తినే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయి టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, భోజనం తర్వాత కాసేపు నడవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.