న్యూస్‌పేపర్‌లో ఆహారం తింటే క్యాన్సర్‌!

14872చూసినవారు
న్యూస్‌పేపర్‌లో ఆహారం తింటే క్యాన్సర్‌!
న్యూస్‌పేపర్లలో వేడి ఆహారాన్ని ప్యాక్ చేసి ఇవ్వడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముద్రణలో ఉపయోగించే ఇంకులో ఉండే సీసం, కాడ్మియం వంటి హానికర రసాయనాలు వేడి ఆహారంతో కలిసే ప్రమాదం ఉందని, దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీ సమస్యలతో పాటు క్యాన్సర్ ముప్పు పెరగొచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వార్తాపత్రికల్లో ఆహార పదార్థాల ప్యాకింగ్, వడ్డింపును నిషేధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి నిషేధం అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు. బటర్ పేపర్, ఫుడ్-గ్రేడ్ ప్యాకింగ్ మెటీరియల్స్, అరటి ఆకులు వంటి సురక్షిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్