ఉదయం ఖాళీ కడుపుతో అరటిపళ్లు, మసాలాలు, టీ-కాఫీ, పచ్చికూరలు, తీపి పదార్థాలు, టమాటాలు వంటివి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, అరటిపళ్లలోని మెగ్నీషియం గుండెపై, మసాలాలు పేగులపై, టీ-కాఫీలు అజీర్ణం, ఊబకాయంపై, పచ్చికూరలు పేగుల ఆరోగ్యంపై, తీపి పదార్థాలు లివర్‌పై, టమాటాల్లోని టేనిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు. పుల్లటి పళ్లు, మద్యం, బేకరీ పదార్థాలు కూడా పరగడుపున మంచివి కావని సూచిస్తున్నారు.