నేలపై కూర్చొని భోజనం చేయడం భారతీయ సంప్రదాయంలో భాగం. కేవలం ఇది ఆచారం మాత్రమే కాదని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పద్మాసనం లేదా సుఖాసనం వంటి భంగిమల్లో కూర్చొని తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు నియంత్రణకు, శరీరానికి బలం, వశ్యతను పెంచడానికి, కీళ్ల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నేలపై కూర్చొని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది, ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.