జంక్‌ ఫుడ్‌పై ఆర్థిక సర్వే కీలక సూచనలు

5400చూసినవారు
జంక్‌ ఫుడ్‌పై ఆర్థిక సర్వే కీలక సూచనలు
అధిక కొవ్వు, చక్కెర కలిగిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను నిషేధించాలని సూచించింది. శిశువులకు పట్టించే పాలు, శీతల పానీయాల మార్కెటింగ్‌ను పరిమితం చేయాలని పిలుపునిచ్చింది. జంక్ ఫుడ్ ఉత్పత్తులపై అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఎంత వినియోగించారో హెచ్చరించేలా న్యూట్రిషన్ లేబుల్ ను ముద్రించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్